ర్యాగింగ్ చేస్తే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లో ఉంది: ఎస్పీ అపూర్వ రావు

నల్గొండ: కామినేని మెడికల్ కళాశాలలో ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా,మాదక ద్రవ్యాలు ,యాంటీ ర్యాగింగ్ చట్టాలపై మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ కె.అపూర్వ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో షీ టీమ్స్ బృందాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. జన సమూహాలు .. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో..నిరంతరం పర్యవేక్షిస్తూ, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నారని కితాబిచ్చారు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తే ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 నుండి అమల్లోకి ఉందన్నారు.

ర్యాగింగ్ చట్టప్రకారం ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు. ర్యాగింగ్ విష సంస్కృతికి అందరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలిసీ తెలియని వయసులో సిగరెట్, గుట్కా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని హితువు పలికారు.ముఖ్యంగా విద్యార్థినులు సామాజిక మాద్యమాల పట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో మెసేజ్ లు పెట్టీ ఇబ్బందులకు గురి చేస్తే.. నిర్భయంగా పోలీసులను ఆశ్రయిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ అపూర్వ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షి టీమ్ ఇంఛార్జి సిఐ రాజశేఖర్ గౌడ్, సిఐ చిట్యాల శివరాం రెడ్డి,నార్కట్ పల్లి యస్. ఐ రామకృష్ణ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. శ్రుతి మహంతి,మెడికల్ సూపర్డెంట్ డా. కాల్ ఎడ్విన్ లుతర్ పోలీస్ కళా బృందం AHTU సిబ్బంది మధు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Optimized by Optimole