‘పుష్ప’ డబ్బింగ్ స్టార్ట్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా గా రాబోతున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు . తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం కొబ్బరికాయ కొట్టి డబ్బింగ్ శ్రీకారం చుట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.
బన్నీ సరసన రష్మిక మందన నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రలో మలయాళ ఫేం ఫహద్‌ ఫాజిల్‌ కనిపించబోతున్నాడు. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13న ఈ చిత్రం విడుదల కానుంది.