పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా సుమారు రూ. 300కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన టీజర్ ట్రైలర్ కూ అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కాబోతున్న రాధే శ్యామ్ కోసం ప్రేక్షకుల ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక రాధే శ్యామ్ మూవీకి సంబంధించి.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ట్విట్టర్ వేదికగా ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.
” రాధేశ్యామ్ మూవీ చూశాను. విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్- పూజాల కెమిస్ట్రీ అదిరిపోయింది. క్లైమాక్స్ ఎవరూ ఊహకు అందని విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాధేశ్యామ్.. క్లాసిక్..రొమాంటిక్.. థ్రిల్లింగ్ మూవీ అంటూ చెప్పుకొచ్చాడు.ప్రభాస్ యాక్టింగ్.. డ్రెస్సింగ్ స్టైలిష్ గా ఉందని.. అతనిని బీట్ చేసేవాళ్లే లేరంటూ పొగడ్తలతో ముంచెత్తారు”
అయితే గతంలో ఉమైర్ రివ్యూలు ఇచ్చిన సినిమాలు కొన్ని విజయవంతం అవగా.. మరికొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద చతికిల పడ్డాయి. మరి రాధేశ్యామ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.