ఐపీఎల్ _15వ సీజన్ షెడ్యూల్ విడుదల..

క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 2022 షెడ్యూల్​నూ బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న మొదలై మే 29న జరిగే ఫైనల్​తో ఐపీఎల్​ 15వ సీజన్​ ముగియనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో కోలకతా జట్టు తలపడనుంది. 65 రోజుల పాటు సాగే ఈ సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది.
ఇక ఈ సారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడనున్నాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లను ఆడుతుంది. లీగ్​ మ్యాచ్​లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది.