యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ప్రేక్షకుల అంచనాల రాధే శ్యామ్ అందుకుందా లేదా అన్నది చూద్దాం!
కథేంటి:
విక్రమాదిత్య(ప్రభాస్) జ్యోతిష్యుడు. హస్త సాముద్రికంలో అతని అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తన చేతిలో ప్రేమ, పెళ్లి రేఖ లేదని తెలుసుకున్న అతను.. జీవితంపై ఓ స్పష్టమైన అంచనాతో ఉంటాడు. అయితే ఓ రోజు ట్రైన్లో అనుకోకుండా విక్రమాదిత్యకు ప్రేరణ(పూజా హెగ్డే) తారసపడుతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఇంతకు విక్రమాదిత్య ప్రేమ ఫలించిందా? వాళ్ల జీవితాల్లో జరిగిన సంఘర్షణ ఏంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఇక సినిమా విషయానికోస్తే.. “మన రాత చేతిరాతలో ఉండదు.. చేతల్లో ఉంటుంది ” అన్న పాయింట్ బేస్ చేసుకుని ప్రేమ కథతో ముడిపెట్టే ప్రయత్నం చేశారు దర్శకుడు రాధాకృష్ణ. చక్కని స్క్రీన్ ప్లే తో సినిమాను ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించిన తీరు నిజంగా అద్భుతం. ప్రభాస్_ పూజా కెమిస్ట్రీ.. వారిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకున్ని కట్టిపడేస్తాయి. డార్లింగ్ చిత్రం తర్వాత ప్రభాస్.. స్టైలిష్ లుక్ లో మెరిసిపోయాడు. మనోజ్ పరమహంస కెమెరా పనితీరు సినిమాకి అదనపు ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. నిర్మాణ విషయంలో నిర్మాతలు ఎక్కడ రాజీ పడలేదు. వారి పెట్టిన ఖర్చు ప్రతి సన్నివేశంలో తెరపై కనిపిస్తోంది.
కాగా పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే.. డార్లింగ్..పూజా ఇద్దరు పోటీపడి పర్ఫామెన్స్ తో మెప్పించారు. రొమాంటిక్, భావోద్వేగ సన్నివేశాల్లో.. వారి యాక్టింగ్ కి ఫిదా అవ్వాల్సిందే. కృష్ణంరాజు.. ప్రభాస్ కి తల్లిగా నటించిన భాగ్యశ్రీ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. సచిన్ ఖేడేకర్, జగపతిబాబు, జయరాం తదితర నటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఓవరాల్ గా చూసుకుంటే ‘రాధే శ్యామ్’ రొటీన్ కు భిన్నంగా.. విధిని ఎదిరించి గెలిచిన చక్కటి ప్రేమకథ.