అమరజవాన్ విగ్రహానికి రాఖీ.. సలాం అంటూ నెటిజన్స్ ప్రశంసలు!

సోదరభావానికి.. ఆత్మీయతకు ప్రతీక రాఖీ. ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ రాఖీ పండగను ఆడంబరంగా జరుపుకుంటారు. ఈక్రమంలోనే ఓ సోదరి రాఖీ కట్టిన చిత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈచిత్రాన్ని చూసిన నెటిజన్స్ సోదరి ప్రేమకు సలాం అంటూ కామెంట్స్ బాక్స్ నింపేశారు. ఇంతకు ఆచిత్రం కథ ఏంటంటే?

ఇక చిత్రం పోస్టును గమనించినట్లయితే .. రాఖీ పండగ సందర్భంగా ఓ సోదరి.. అమరుడైన తన సోదరుడు విగ్రహానికి రాఖీ కడుతున్నట్లు కనిపిస్తోంది. అమరజవాన్ పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా.. అతను జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. అతని వీరత్వానికి గుర్తుగా గ్రామస్తులు విగ్రహాం ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే సోదరి  రాఖీ పర్వదినం సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టి గౌరవించింది. ఈఫోటోను వేదాంత్ బిర్లా అనే వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో చేశారు. దీంతో నెటిజన్స్ యువతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటి వరకు ఈపోస్టుకు 3k పైగా కామెంట్స్ వచ్చాయి . వేలాది మంది లైక్ చేస్తున్నారు. దేశ సేవలో ప్రాణాల కోల్పోయిన అమరజవాన్ సలాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ తో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Optimized by Optimole