బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తృణమూల్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే
టీఎంసీకి చెందిన పలువురు నేతలు, నాయకులు పార్టీని విడడంతో అధినేత్రి మమతా బెనర్జీ కి మింగుడుపడడం లేదు. తాజాగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ పార్టీ,పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ సంఘటనతో పార్టీలోఅంతర్మధనం మొదలైంది.
బెనర్జీ రాజీనామా లేఖను ట్వీటర్లో పోస్ట్ చేస్తూ.. ఇన్నాళ్లపాటు ప్రజల సేవ చేసే భాగ్యం దక్కినందుకు సంతోషంగా ఉందని.. ఈ అవకాశం కల్పించిన దీదీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే బెనర్జీ రాజీనామాకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
ఇక దీదీ కుడి భుజమైన సువెందు అధికారి బీజీపీలో చేరడంతో రాజీవ్ సైతం అందులో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజీపీ అనూహ్య రీతిలో పుంజుకొవడంతో పార్టీలోని అసంతృప్తులు ఒక్కొక్కరిగా ఆ పార్టీలోకి వలస బాట పట్టారు. ఎన్నికలు షెడ్యూల్ వచ్చేసరికి పార్టీలోని మరికొంతమంది వెళ్లే సూచనలు కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.