Atmakur: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరు బాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు (m)మండలం పరిధిలో ఉన్న పల్లెర్ల గ్రామంలోని ఐకెపి సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను..మధ్య దళారులకు తక్కువ ధరలకు ఆముకొని నష్ట పోతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ.. రైతుబంధు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే చిత్తశుద్ధితో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. అలాగే ఎండిపోయిన పంట రైతులకు తగిన నష్ట పరిహారం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఎకరాకు 3వేలు ఇవ్వాలని.. రైతులకు రైతుబంధు, రైతు బీమా వర్తింపజేయాలని.. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని భిక్షం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వంటి పెంటి గోపాల్ రెడ్డి, గ్రామ కార్యదర్శి గునె బోయిన స్వామి, రైతు సంఘం నాయకులు నాయిని రాంరెడ్డి, నాయిని కృష్ణారెడ్డి, సంగాపాకస్వామి, నాయిని యాదిరెడ్డి, నవ్య శ్రీ, సంధ్య,తదితరులు పాల్గొన్నారు.