తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచార పద్దు పై నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. నిత్యం ప్రధాన మోదీ వస్త్రధారణ, ప్రచారం పై కామెంట్ చేసే ముఖ్యమంత్రి.. తన ప్రచార పద్దు సంగతెంటి చర్చను నెటిజన్స్ లేవనెత్తారు. బడ్జెట్లో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్ డీఎఫ్)కు, ప్రచార కోసం ఐఅండ్ పీఆర్ విభాగానికి భారీగా నిధులు కేటాయించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ స్వలాభం కోసం ఆయనకున్న విచక్షణాధికారులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. మనం చేస్తే సంసారం.. పక్కనోడు చేస్తే వ్యభిచారమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాగా 20222-23 బడ్జెట్లో పత్రికలు , ప్రకటనల కోసం బడ్జెట్లో రూ.2000 కోట్లను కేటాయించారు. ఈసారి ఏకంగా ఐదు రెట్లు పెంచేసి 10 వేల 348 కోట్లనే కేటాయించారు.నిజానికి గతంలో ఇలాంటి పద్దు ఉండేదికాదని..ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ ఎఫ్),డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద మాత్రమే నిధులను కేటాయించేవారని నెటిజన్స్ గుర్తుచేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిఆర్ ఎస్ ప్రభుత్వం 2017 లో ఎస్ డీఫ్ పేరిట ఈఘనకార్యానికి పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటు ప్రతిపక్ష నేతలు సైతం ఎస్ డీఎఫ్ కేటాయింపులపై మండిపడుతున్నారు. రాజకీయ స్వలాభం కోసం ప్రజాసొమ్మును దుర్వినయోగం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు ప్రకటనల కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం రూ.300 కోట్లను వెచ్చించిందని ఆర్టీఐ కింద పొందన సమాచారం మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పడు ఎన్నికల ఏడాదిలో కేవలం ప్రచారం కోసమే 10 వేల కోట్లను కేటాయిస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని కేటాయింపులు ఉండే అవకాశం లేకపోలేదన్నది నెటిజన్స్ వాదన.
ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆపార్టీ పబ్లిసిటి చేసుకోవడానికి వీలులేకుండా.. ముందుగానే మెట్రోపిల్లర్లను అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నిరకాల హోర్డింగులు, సైనేజ్ బోర్డులను బిఆర్ ఎస్ బుక్ చేసుకోపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నగరంలోని హెర్డింగుల కోసం జీహెచ్ ఎంసీ నిర్వహించిన టెండర్ ప్రక్రియలో లీడ్ స్పేస్ , ప్రకాష్ ఆర్ట్స్ అనే రెండు కంపెనీలకు మాత్రమే దక్కడంపై ప్రతిపక్ష నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.