అంబర్ పేట రాజకీయం రంజుగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే వెంకటేష్ కు సర్వే రిపోర్టు.. స్థానిక పార్టీ నేతల వ్యవహరం కలవరపెడుతుంటే.. బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారు ఎమ్మెల్యేగా పోటిచేయడం దాదాపు ఖరారైంది. అటు కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు పోటిచేయడంపై సందిగ్థత నెలకొంది.
ఎమ్మెల్యేకు సర్వే టెన్షన్ ..
గత ఎన్నికల్లో బిఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాలే వెంకటేష్ మళ్లీ పోటికి రెడీ అయ్యారు. అయితే కాలేరుకు పార్టీ నిర్వహించిన సర్వే భయం పట్టుకుంది. నియెజకవర్గంలో ఆయన గ్రాఫ్ బాగా తగ్గినట్లు.. మరో అభ్యర్థిని బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈనేపథ్యంలోనే స్థానిక కార్పేరేటర్ భర్త, మరికొంత మంది టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సాయన్న ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జేల శ్రీనివాస్ , ఎర్రోళ్ల శ్రీనివాస్, కృషాంక్ లు సైతం సీటుపై కన్నేశారు. ఈపరిణామాల మధ్య ఆయనకు మరోసారి టికెట్ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
కేంద్రమంత్రి పోటిచేయడం ఖాయం..
ఇక్కడ బీజేపీ నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2018 ఎన్నికల్లో ఓడిపోయి..2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈసారి తిరిగి ఎమ్మెల్యేగా పోటి చేయడం ఖాయమైంది. ఇప్పటికే పాదయాత్ర పేరిట నియోజకవర్గంలో తిరుగుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసొస్తుందని.. ఈసీటు కాషాయం పార్టీదేనని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నది కాషాయం నేతల అభిప్రాయంగా వినిపిస్తుంది.
ఇక నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు ఖమ్మంగా పోటిచేస్తానని ప్రకటించారు. తాను సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని పార్టీ అధినాయకత్వానికి షరతులు పెడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమి తరపున టిజెఎస్ తరపున కోదండరాం పోటిచేశారు. మరోసారి పొత్తు కుదిరితే టిజేఎస్ అధినేత పోటిచేయడం ఖాయంగా భావించవచ్చు.
మైనార్టీ ఓట్లు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. ఎంఐఎం బలమైన అభ్యర్థిని దింపింతే అన్ని పార్టీలకు ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.