Bandisanjay: ప్రజాహిత యాత్రతో సమర శంఖం పూరించిన బండి సంజయ్..!!

Bandisanjay:  బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర భారీ జన సందోహం మధ్య ప్రారంభమైంది. కొండ గట్టు అంజన్న ఆశీర్వాదంతో సంజయ్.. మేడిపల్లి నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజే  సంజయ్ కు మద్దతుగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు  తరలివచ్చారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. యాత్రలో భాగంగా మేడిపల్లి మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో  మమేకం అవుతూ ఎంపీ ముందుకు సాగారు. ప్రజల కష్టాలను తెలుసుకొని భరోసా కల్పించారు. యాత్రలో సంజయ్ తో సెల్ఫీ దిగిందేకు మహిళలు,యువతులు పోటీపడ్డారు.

పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యలే ధ్యేయంగా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర మొదలెట్టారు. అందులో భాగంగానే తొలి రోజు యాత్ర మేడిపల్లి, కొండాపూర్ , రంగాపూర్, భీమారం, మన్నేగూడ గ్రామాల మీదుగా సాగింది. యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను సంజయ్ తో ఏకరువు పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వంతో కొట్లాడైనా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని..ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  సంజయ్  భరోసా కల్పించారు.

ఇక యాత్రలో భాగంగా తొలిరోజే సంజయ్ తనదైన శైలిలో  అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలను ఏకిపారేశారు. అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది అని.. హామీల అమలు కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులతో వారి బండారం బయటపడిందని ధ్వజమెత్తారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమి లేదని.. వాళ్ల హయాంలో అభివృద్ది పరంగా కరీంనగర్ ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కేంద్ర నిధులతో అనేక అభివృధి పనులు జరిగాయని.. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ గెలిపించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని సంజయ్ హితువు పలికారు.

అటు తొలి రోజు యాత్రలో ఎంపిగా తన పనితీరుపై ప్రశ్నించిన నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సంజయ్. తనను ప్రశ్నించిన నేతల మూత వేయించేందుకే ప్రజాహిత యాత్ర చేపట్టినట్లు కుండ బద్దలు కొట్టారు. ఎంపీగా ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ది కోసం రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చానని.. వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి రూ.590 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన ఘనత మోదీ సర్కార్ దే అని స్పష్టం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ మోదీ ప్రభుత్వానివే అని.. మేడిపల్లిలో రోడ్ల కోసమే రూ.20 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. మేడిపల్లి మండలానికి ఉపాధి హామీ పనుల కోసం రూ.5 కోట్ల 16 లక్షలు ఇచ్చామని..రోడ్ల కోసం కోటి రూపాయలకుపైగా ఇచ్చామని తెలిపారు. మరుగుదొడ్ల కోసం 30 కోట్లకుపైగా.. ఆర్దిక సంఘం నిధుల కోసం 2 కోట్లకుపైగా నిధులిచ్చామని సంజయ్ వెల్లడించారు.

” రాముడు..మోదీ అండగా ఉన్నారు…” 

బండి సంజయ్ కు అండగా ఎవరున్నారని కొందరు నేతలు కూస్తున్నారు.. నాకు అండగా మోదీ, రాముడు ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన రజాకార్ల పార్టీ, రాక్షసుల పార్టీ అండగా ఉందని  సంజయ్ ఎద్దేవ చేశారు. రామరాజ్యం కోసం తపిస్తున్న మోదీ పాలన కావాలా?… రజాకార్ల రాక్షసులకు వత్తాసు పలుకుతున్న రాహుల్ పాలన కావాలా? నిరంతరం ప్రజల కోసం పోరాడే బండి సంజయ్ కావాలా?… విహార యాత్రల మాదిరిగా అప్పడప్పుడు వచ్చే నేతలు కావాలా? రాముడి వారసుల పార్టీ కావాలా?…. రాక్షస వారసుల పార్టీలు కావాలా? దేవుడిని నమ్మే బీజేపీ కావాలా?…. దేవుడిని నమ్మకుండా హేళన చేసే పార్టీలు కావాలా? అని సంజయ్ ప్రశ్నించారు.

మాతృమూర్తికి పాదాభివందనం..

‘ ప్రజాహిత’  యాత్రకు బయల్దేరే ముందు బండి సంజయ్ తన మాతృమూర్తికి పాదాభివందనం చేసి  ఆశీస్సులు తీసుకున్నారు. గత పాదయాత్ర మాదిరి ఈ యాత్ర విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం పట్టణంలోని మహాశక్తి ఆలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. 

 కొండగట్టు అంజన్న సాక్షిగా ..

ఉమ్మడి కరీంనగర్  హితం కోసం ‘ ప్రజాహిత’ యాత్రతో  పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేసి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు.

 

Optimized by Optimole