Tamilnadu: తొలి రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్ గా ట్రాన్స్ జెండర్..

Transgendersindhu: ఇటీవల అన్ని రంగాల్లో హిజ్రాల ప్రాబల్యం పెరిగిపోతోంది. తక్కువ స్థాయి అన్యున్నత భావన నుంచి మేమేం తక్కువ స్థాయికి వారు ఎదుగుతున్న తీరు ” న భూతో న భవిష్యతి” . ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ హిజ్రా తొలిసారిగా రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైంది. 

ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడు నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు ఎన్నో అవమానాలను తట్టుకొని రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైంది. శుక్రవారం సింధు దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని..హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరు కున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా చదువుకోని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సింధు సూచించారు.