బాలుడి మ్యాజిక్ వీడియోకి శిఖర్ ధావన్ ఫిదా.. వైరల్!

ఓ స్కూల్ బాలుడు చిన్న చిన్న రాళ్లతో మ్యాజిక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి వీడియోని సాహిల్ ఆజం అనే వ్యక్తి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో.. 128 మిలియన్ల మంది వీక్షించారు. అయితే సాహిల్ ఆవీడియోకు ఎలాంటి క్యాప్షన్ జోడించకపోవడం గమన్హారం.

ఇక బాలుడు రెండు చిన్న రాళ్లనూ .. ఒక చేతి నుంచి మరో చేతికి మారుస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే .. అతని స్నేహితులు మంత్రముగ్ధులై తథేకంగా చూస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈవీడియో చూసిన నెటిజన్స్.. అతడు ఇండియన్ జస్టిన్ బీబర్ తో పోల్చుతూ పోస్ట్ చేశారు. మరోక నెటిజన్.. అతడిని చిన్న మెజిషియన్ అంటూ సెల్యూట్ చేశాడు.ఈవీడియోని క్రికెటర్ శిఖర్ ధావన్ తో సహా ఆరు మిలియన్ల మందికి పైగా లైక్ చేశారు.

క్రిందిలింక్ లో మీరు బాలుడి మ్యాజిక్ వీడియో చూడవచ్చు..!

View this post on Instagram

 

A post shared by Sahil Saifi (@sahil.aazam)