తల్లికావాలంటే పెళ్లి చేసుకోవాలా ? సీనియర్ నటి కామెంట్స్ వైరల్..!!

పెళ్లిపై సీనియర్ నటి టబు ఆసక్తికర కామెంట్స్ చేసింది . తెలుగు, తమిళ్ ,హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఈఅమ్మడు.. ఐదు పదుల వయసొచ్చిన పెళ్లి చేసుకోలేదు. గతంలో తాను పెళ్లి చేసుకోకపోవడానికి ఓబాలీవుడ్ హీరో కారణమంటూ బాంబ్ పేల్చిన ఈభామ..తాజాగా  ఓఇంటర్వ్యూ భాగంగా  పెళ్లిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈబ్యూటీ ఓ యంగ్ హీరోతో ప్రేమలోపడినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఆవార్తలపై ఆమె పెద్దగా రియాక్ట్ కాకపోవడం గమన్హారం.

ఇక ఇంటర్వ్యూలో భాగంగా .. మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.. మీకు అమ్మ అని పిలిపించుకోవాలని లేదా? అన్న ప్రశ్నకు టబు బదులిస్తూ.. తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.. సరోగసి ద్వారా కూడా తల్లి కావొచ్చు.. అనుకుంటే అలా చేస్తా..నన్ను ఎవరూ ఆపరు. అయినా పెళ్లి కాకపోయినా.. పిల్లల్ని కనకపోయినా చచ్చిపోతామా.. అంటూ టబు సమాధానం ఇచ్చింది.అంతేకాక ప్రేమకు.. పెళ్ళికి.. వయసుతో సంబంధం లేదు.. ఏదైనా చేయాలనుకుంటే వయసు అడ్డంకి కాదు అంటూ చెప్పుకొచ్చింది ఈసీనియర్ బ్యూటీ.

Related Articles

Latest Articles

Optimized by Optimole