శశికళ సంచలన నిర్ణయం!

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నా డీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఏనాడు అధికారంపై మోజు లేదని, జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. డీఎంకే కుటుంబపాలనలకు స్వస్తి చెప్పి అమ్మ పాలన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కాగా, అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ చక్రం తిప్పుతారని భావించిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేయడం విస్మయానికి గురిచేసింది.