వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడు ఆటగాడిగా పొలర్డ్ రికార్డు నెలకొల్పాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో స్పిన్నర్ ధనుంజయ వేసిన ఓ ఓవర్లో ఆరు బంతులను సిక్సర్స్ గా మలిచి ఈ ఘనత సాధించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఈ ఘనత సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ _2007 లో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్, ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్_ 2007 లో దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో హె ర్షెల్ గిబ్స్, నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వన్ బంగ్ బౌలింగ్లో ఒకే ఒవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డును నమోదు చేశాడు.