×

శివరాత్రి అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. లింగోద్భవం. అసలు లింగోద్భం గురించి పురాణాగాథలు ఏమిటీ తెలుసుకుందాం… శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు  పానవట్టం పార్వతీరూపం అని ఆగమ వాక్యం. ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ , వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారం ప్రతీకగా ఏర్పడినది. జ్ఞానరూపియైన *శివుడు* చైతన్యజ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్య గా చెపుతారు దానిముందురోజు శివరాత్రిగా చెపుతారు.

కాబట్టే లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని శివరాత్రిగా చెపుతారు. ఇది ప్రతిమాసంలో వస్తుంది. కానీ పాలసముద్రం చిలికినపుడు హాలాహలభక్షణం చేసి ఒక చిన్న రేగుపండు అంతగా చేసి కంఠంలో ధరించినరాత్రి లోకాల్నికాపాడిన శివుని ఆరాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించినరాత్రిగా మహాశివరాత్రి అని చెపుతారు. లోకమంతా శివరక్షణవల్ల మంగళాన్ని పొందుటవల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడ జరుపుతారు.

లింగోద్భవ పుణ్యకాలంలో శివరాత్రి నాడు చేయవలసిన విధులు ఇవే..

అన్నం కాకుండా పాలు , పండ్లు పలహారం మాత్రమే తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి ఇతరులతో మాటల్లోకూడా దైవసంబంధమైనవే ఎక్కువగా ఉండటం వీలైనంత తక్కువ మాట్లాడటం ఎక్కువసేపు పంచాక్షరీ *ఓం నమశ్శివాయ* జపం చేయటం పండ్లు పలహారాలు దేవునికి నివేదించటం వాటిని ఇతరులకు పంచిపెట్టటం వీలైనంత వరకు జాగరణచేయటం శివునికి అభిషేకం చేస్తే చాలామంచిది. చాపమీద పడుకోవాలి , స్త్రీ లైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించాలి. లింగోద్భవపుణ్యకాలం వరకూ మేల్కొని ఉండాలి. వీలైతే మరుసటి రోజువరకూ ఉండాలి.

శివరాత్రిరోజు చేయకూడనివి ఇవే !

అనారోగ్యంతో ఉపవాసం చేయకండి సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి. ప్రాతస్సంధ్య , సాయం సంధ్యలో నిద్రపోకండి , శివ పూజకి మొగలిపూవు వాడకండి. నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి ఇతరపదార్థాలు (పంచామృతం , పండ్లరసాలు , సుగంధ పరిమళ పదార్థాలు) తక్కువగా వాడండి. సిమెంట్ రాతివంటి అన్నిలింగాలకన్నా పుట్టమన్నుతో చేసినశివలింగానికి అభిషేకిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. తినాల్సిన స్థితివస్తే పిండిపదార్థాలు తీసుకోవచ్చు. పండ్లు , పాలు తీసుకోండి. అవీ తక్కువ మోతాదులో శరీరానికి అవసరమైన కనీసస్థాయిలో మాత్రమే.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

ఆత్మ ప్రయాణం: మరణానంతరం 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర

Devotional: సనాతన ధర్మం ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక దశ ముగింపు… మరో దశకు ఆరంభం.మనిషి శరీరం నశించినా, ఆత్మ నశించదు. తన కర్మల భారంతో, ఆశయాలతో...

Read out all

Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం...

Read out all

kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?

Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని...

Read out all

Varanasi: కాశీ వారాహీ అమ్మవారిని రాత్రి పూటనే ఎందుకు దర్శిస్తారు..?

Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం....

Read out all

Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం...

Read out all

Ashadam: ఆషాఢం – ఆధ్యాత్మికతకు మూలం..!

Ashadamasam: చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య సంచరించటం వలన దీనికి ‘ఆషాఢం’ అనే పేరు వచ్చింది. అయితే దీనినే శూన్య మాసం అని కూడా పిలుస్తారు....

Read out all
Optimized by Optimole