అందం అభినమయంతో ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో అభిమానులను సంపాదించుకున్న నటి శ్రద్ధా కపూర్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం నాగిని. ఈ చిత్రానికి సంబంధించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా బాల్యంలో శ్రీదేవి మేడం నటించిన నాగిని సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని.. ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయలనుకునేదాన్ని , ఇప్పుడు ఆకోరిక నెరవేరబోతుంది.. నాగిని పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నా అని శ్రద్ధా చెప్పుకొచ్చింది. శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ బెనర్లో నిఖిల్ ద్వివెది నాగిని చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ ప్యూరియా దర్శకుడు. మొత్తం మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. కాగా నాగిని చిత్రాన్ని ప్రకటించాక ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని శ్రద్ధ అన్నారు. దీంతో మరింత బాధ్యత పెంచిందని ఆమె పేర్కొన్నారు. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా చిత్రాన్ని రూపొందిస్తామని, చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకాబోతుందని శ్రద్ధ వెల్లడించారు.