అనారోగ్యం రూమర్స్ పై శ్రుతిహాసన్ క్లారీటీ..!!

shrithihasan

తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ కు నటి శ్రుతి హాసన్ సోషల్ మీడియా వేదికగా క్లారీటి ఇచ్చింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..బిజీ షెడ్యూల్ కారణంగా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఎండోమెట్రియోసిస్‌తో(PCOS) వ్యాధితో బాధపడుతున్నారు. ఈవిషయంలో కొన్ని మీడియా సంస్థలు ,ఆరోగ్య పరిస్థితిపై అసత్యాలను ప్రచారం చేశాయని..ప్రస్తుతం తానూ బాగానే ఉన్నానంటూ శృతిహాసన్ స్పష్టతనిచ్చింది.

 

ఇక శృతిహాసన్ ఇన్ స్టాగ్రామ్ వీడియోలో మాట్లాడుతూ.. అందరీకి నమస్కారం బిజీ షెడ్యూల్ కారణంగా అద్బతమైన హైదరాబాద్ నగరం నుంచి మాట్లాడుతున్నానని.. కొద్ది రోజుల ముందు రోజువారి దినచర్యలో భాగంగా వ్యాయాయం గురించి చేసిన పోస్ట్ పై క్లారీటీ ఇవ్వదలచుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. చాలామంది మహిళలను వేధిస్తున్న pocs సమస్యతో తానూ బాధపడుతున్నట్లు.. కొద్దీగా అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని.. అంతమాత్రానా దీని అర్థం క్రిటికల్ కండీషన్లో ఉన్నట్లు కాదని తేల్చిచెప్పారు. కొన్ని మీడియా సంస్థలు విషయాన్ని విస్మరించినట్లు గ్రహించానని.. హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యావా అంటూ శ్రేయాభిలాషుల నుంచి కాల్స్ సైతం రావడంతో క్లారీటి ఇస్తున్నట్లు శృతిహాసన్ స్పష్టం చేశారు.