బాలీవుడ్ పఠాన్ మూవీని బాయ్ కాట్ ఫీవర్ వెంటాడుతోంది. సినిమా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో..సోషల్ మీడియాలో ‘పఠాన్ కు నేర్పుదాం గుణపాఠం హ్యష్ ట్యాగ్’ ట్రెండింగ్లో ఉండటం కలవరానికి గురిచేస్తుంది. ఇప్పటికే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఓరేంజ్ లో జరిగినట్లు సినివిశ్లేషకులు పోస్టుల్లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెగిటివిటి ప్రచారం సినిమాకు పెద్ద దెబ్బని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.
కాగా కరోనా అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ సరైన హిట్ లేక సతమతమవుతోంది. ఇటు సౌత్ హీరోలు వరుస హిట్లతో పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంటే.. అక్కడి స్టార్స్ మాత్రం బిగ్గెస్ట్ ప్లాప్స్ తో నిరాశలో కూరుకుపోయారు.ముఖ్యంగా బాలీవుడ్ త్రయం సల్మాన్,షారుఖ్, అమిర్.. తమ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇది చాలదన్నట్లు నెపొటిజం ఖాన్ త్రయాన్ని వెంటాడుతోంది.
ఇక పఠాన్ సినిమా విషయానికొస్తే .. గతంలో హీరో ,హీరోయిన్లు హిందు మతానికి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ కామెంట్స్ తో నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. బాలీవుడ్ లో నెపొటిజం విపరీతంగా పెరిగిపోయిందని.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి ప్రధాన కారణం ఇదేనని ఫైర్ అవుతున్నారు. ఏదిఏమైనా మూవీని బాయ్ కాట్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఇదిలా ఉంటే.. పఠాన్ మూవీ సాంగ్ విషయంలోను వివాదం తలెత్తింది. హీరోయిన్ దీపికా పదుకుణే కాస్ట్యూమ్స్ హిందు మతానికి కించపరిచేలా ఉన్నాయని స్వయంగా ఓ రాష్ట్ర మంత్రి మీడియా ద్వారా చిత్ర యూనిట్ ను హెచ్చరించారు. హిందు సంఘాలు సైతం కాస్ట్యూమ్స్ విషయంలో అభ్యంతరాన్ని తెలిపాయి.
మొత్తంగా చూస్తుంటే.. ఇన్ని వివాదాలు మధ్య విడుదలవుతున్న పఠాన్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందా? గత చిత్రాల మాదిరి బాక్స్ ఫీస్ వద్ద బోల్తా కొడుతుందా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న..!