భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్ ట్విట్లో రాసుకొచ్చాడు.
ఇక కర్ణాటకు చెందిన ఉతప్ప.. 2007 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు.అతడి ప్రతిభకు కొదవలేకున్న..టీంఇండియాలో ఇలా వచ్చి అలా వెళుతుండేవాడు. ఐపీఎల్లో మాత్రం తనదైన మార్క్ ఆటతీరుతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాడు.ఇంటర్నేషనల్ క్రికెట్ లో 46 వన్డేలు, 12 టీ20లు ఆడిన అతను.. టెస్టు జట్టులో మాత్రం చోటు సంపాదించుకోలేకపోయాడు. కానీ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో మాత్రం అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు 205 మ్యాచుల్లో 130.30 స్ట్రైక్‌రేట్‌తో 4,952 పరుగులు సాధించాడు. ఇందులో 27 అర్ధశతకాలు ఉన్నాయి. బెంగళూరు, రాజస్థాన్, ముంబయి, కోల్‌కతా, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో.. వన్డేల్లో 6 హాఫ్ సెంచరీల సాయంతో 934 పరుగులు, టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 249 పరుగులు సాధించాడు.భారత-ఏ జట్టుకు సారథిగా వ్యవహరించిన రాబిన్.. టీమ్‌ఇండియా తరఫున తన చివరి మ్యా్చ్‌ను 2015లో ఆడాడు
పాక్ పై హాఫ్ సెంచరీ చిరస్మరణీయ ఇన్నింగ్స్..
2007 టీ20 ప్రపంచకప్ లో యువకులతో కూడిన భారత జట్టులో సభ్యుడు. ఆటోర్నీ అసాంతం ఉతప్ప పలు మ్యాచ్లో కీలక ఇన్సింగ్స్ ఆడాడు.ముఖ్యంగా దాయాది పాక్ తో మ్యాచ్ లో కేవలం 39 బంతుల్లో 50 పరుగులు చేసి భారత విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఆమ్యాచ్ లో కీలక ఆటగాళ్లు పెవిలియన్ కి క్యూ కడుతున్న.. ఉతప్ప మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా ఆడిన తీరు హైలెట్. కాగా ఆమ్యాచ్ లో భారత్ తరఫున ఉతప్పదే అత్యధిక స్కోరు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అర్ధశతకం సాధించిన తొలి బ్యాటర్ గా రాబిన్ రికార్డు సృష్టించాడు.