ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘనవిజయం సాధించింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్న క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన తగ్గేదెలే డైలాగ్ .. సామీ సామీ సాంగ్ కు అనుకరిస్తూ అభిమానులు చేసిన వీడియోలు చాలానే చూశాం. తాజాగా ఓచిన్నారి సామీ సామీ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట్ట తెగ హాల్ చల్ చేస్తోంది.పాప డ్యాన్స్ వీడియోనూ ఓవ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ..సినిమా హీరోయిన్ రష్మిక మందన్నకు ట్యాగ్ చేశాడు.
కాగా వీడియో చేసిన హీరోయిన్ రష్మిక.. పాప డ్యాన్స్ కు ఫిదా అయిపోయింది. వెంటనే ట్యాగ్ కూ ‘మైడే..మైడే ..ఈచబ్బి బేబిని కలవాలని ఉందని.. ఏవరైనా సహయం చేయగలరా’ ? అంటూ కామెంట్ చేసింది. దీంతో స్పందించిన ఓ నెటిజన్.. పాప కలవాలనుకుంటే నేపాల్ వెళ్లండని నటికి సలహా ఇచ్చాడు.ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన చిన్నారి వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించగా.. వేలకొద్ది లైక్స్ వస్తున్నాయి.
How sweet? Viral on social media.@alluarjun @iamRashmika pic.twitter.com/oANITkp1Os
— Vikash Tiwary (@ivikashtiwary) September 14, 2022