అతను బ్యాట్ పట్టాడంటే చాలు మైదానంలో పరుగులు మోత మోగాల్సిందే.అతను క్రీజులో ఉంటే భారత క్రికెట్ అభిమానులకు కొండంత ధైర్యం . విజయం మనదేనన్న భరోసా.ఆటతీరుకే కాదు తన మేనరిజానికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ సచిన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానంమే అతను.ఆటగాడిగానే కాకుండా ‘మిస్టర్ కూల్’ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టి తనదైన నాయకత్వ పటిమతో జట్టును అగ్రపథంలో నిలిపిన తీరు’ న భూతో న భవిష్యతీ’.పరుగుల రారాజు..రికార్టుల కింగ్.. రన్ మెషిన్ వంటి బిరుదులతో వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ డైలాగ్ తరహాలో దూకుడైన ఆటతీరుతో దూసుకుపోతున్న నయా జనరేషన్ టీంఇండియా టార్చ్ బెరర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. ఈసందర్భంగా అతని ప్రత్యేకతలను తెల్సుకుందాం..
విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988 న ఢిల్లీలో జన్మించాడు. తల్లిదండ్రులకు విరాట్ మూడవ సంతానం. అతని కంటే ముందు సోదరుడు వికాస్, సోదరి భావన ఉన్నారు. తండ్రి మరణాంతరం తన కెరీర్ పై సోదరుడు ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడని విరాట్ పలు ఇంటర్వ్యూల్లో బాహాటంగానే చెప్పుకొచ్చాడు. కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబం ఎల్లపుడూ అండగా ఉంటుదని అంటాడు రికార్డుల కింగ్. వీలు దొరికితే చాలు కుటుంబంతో గడపడానికి ఇష్టపడతాడని అతను సన్నిహితులు చెబుతుంటారు. ఇక తన భాగస్వామి నటి అనుష్క శర్మను 2017 లో విరాట్ వివాహమాడాడు. ఈదంపతులకు వామికా ఏకైక సంతానం .
ఇదిలా ఉంటే.. 2008 మలేషియాలో జరిగిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకి విరాట్ సారథిగా వ్యవహరించాడు. టోర్నీలో ఆటగాడినే కాకుండా కెప్టెన్ గా జట్టు విజయంలో కీరోల్ పోషించాడు.అనంతరం అదే ఏడాది ఐపీఎల్ టోర్నీ మొదలవడంతో రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.ఇక అక్కడ నుంచి మొదలైన రికార్డుల రారాజు అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం నేటికి విజయవంతంగా కొనసాగుతోంది.అటు ఐపీఎల్ లోనూ ..ఇటు ఇంటర్నేషన్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తూ చరిత్రలో లిఖించే విధంగా రికార్డులు తిరగరాస్తున్నాడు.
జెర్సీనెంబర్ వెనక కథ..
విరాట్ జెర్సీ నెంబర్ 18 ధరించడం వెనక పెను విషాదగాథ దాగి ఉంది. ఢిల్లీ తరపున 18 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫిలో భాగంగా విరాట్.. కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో తండ్రి మరణించాడని వార్త తెలిసిన.. ఆమ్యాచ్ లో గొప్ప ఇన్నింగ్స్ ఆడి ఆటపట్ల తనకు ఉన్న నిబద్దతను చాటుకున్నాడు.మ్యాచ్ అనంతరం తండ్రిని గుర్తు చేసుకుంటూ అతను ఎమోషనల్ అయిన సందర్భాన్ని జట్టు సభ్యులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
ప్రత్యేకతలు..
– 22 ఏళ్ల వయసుకంటే ముందే వన్డేల్లో సెంచరీలు చేసిన ఆటగాడిగా రన్ మెషిన్ రికార్డు సృష్టించాడు.అతనికంటే ముందు సచిన్, రైనా ఈఘనత సాధించిన జాబితాలో ఉన్నారు.
_ ప్రపంచకప్ ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా విరాట్ రికార్డు నెలకొల్పాడు.
_ వన్టేల్లో వ్యక్తిగత స్కోర్ తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై అత్యధిక పరుగులు (183*) చేసిన ఆటగాడి రికార్డు కోహ్లీ పేరిట ఉంది.
_ 23 ఏళ్లకే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్న భారత క్రికెటర్ కోహ్లీ.
_ ICC t20 వరల్డ్ కప్ , ICC టెస్ట్ చాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన ఏకైక క్రికెటర్ కోహ్లీ మాత్రమే.
_ తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా పాకిస్తాన్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్..ఇండియన్ క్రికెట్ హిస్టరిలో గొప్పదని భారత మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కొనియాడారు.