9.2 C
London
Wednesday, January 15, 2025
HomeNationaltribalsociety: గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ

tribalsociety: గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...
spot_imgspot_img

Raparthy vinod Kumar:

అంతరాలను పూడ్చటమే కాదు… వారి వారసత్వం, గిరియువత సాధికారత లక్ష్యం
కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ..

అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత నిర్లక్ష్యం అనంతరం వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. అంతరాలను పూడ్చడమే కాకుండా.. ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. వారికి ఉజ్వలమైన, సమ్మిళిత భవిష్యత్ ను అందించే దిశగా చరిత్రలో నిలిచిపోయే
కార్యక్రమాలను ఈ పదేళ్లలో ప్రభుత్వంచేపట్టిందన్నారు. ఎస్టీల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక నిధులు 2013-14లో రూ.24,600 కోట్ల నుంచి 2024-25 నాటికి దాదాపు ఐదు రెట్లు పెరిగి రూ.1.23 లక్షల కోట్లకు చేరాయి. పాఠశాలల్లో నమోదైన వారి సంఖ్య 2013-14లో 34,000 ఉండగా, 2023-24 నాటికి అది 1.3 లక్షలకు పెరిగింది. ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు (ఈఎంఆర్ఎస్) పెరగడం ఈ మార్పునకు మూలకారణం. దశాబ్ద కాలంలోనే వాటి సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 123 నుంచి 476కు చేరింది. రక్తహీనతను అరికట్టడానికి ప్రభుత్వం సికిల్ సెల్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే 4.6 కోట్ల మందినిపరీక్షించారు.మూడేళ్లలో 7 కోట్ల మందికి ఈ పరీక్షలను చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఏటా 30 లక్షల మంది గిరిజన విద్యార్థులకు ఉపకారవేతనాల ద్వారా లబ్ధి చేకూర్చుతుంది. గత పదేళ్లలో మొత్తం రూ.17,000 కోట్ల ఉపకారవేతనాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గిరిజనస్వాతంత్య్ర సమరయోధుల కోసం 10 ప్రదర్శన శాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించింది. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం 3,900 వన్ ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు చేసింది. వీటి ద్వారా  దాదాపు 12 లక్షల మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నారు. భారతదేశపు తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక గిరిజనప్రాతినిధ్యంలో ఒక ప్రతిష్ఠాత్మకమైన ముందడుగు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో సమ్మిళిత్వాన్ని సాధించింది. పీఎం-జన్ మన్ ద్వారా గృహనిర్మాణం, శుద్ధమైన నీరు, పారిశుధ్యం, ఆరోగ్య రక్షణ వంటి అత్యవసర సేవలు గిరిజనులకు అందుతున్నాయి. 75 అత్యంత దుర్భల గిరిజన సమూహాలు (పీవీటీజీ), 45 లక్షలకు పైగా కుటుంబాలకు రూ. 24,000 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ లో షెడ్యూల్డ్ తెగలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. వెదురును చెట్లను జాబితా నుంచి తొలగించడం ద్వారా స్వేచ్ఛగా దానిని కోసుకోవ డానికి గిరిజనులకు అవకాశం లభించింది. ఈ మార్పు గిరిజన కుటుంబాలకు సరికొత్త ఆదాయ వనరుగా మారడంతోపాటు ‘ఆకుపచ్చ బంగారం’గా వెదురు… గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడుతోంది. ధర్తి అబ జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా తొలిసారిగా గిరిజన వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చేందుకు, 63,000 గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజన ప్రజలకు 100% ప్రయోజనాలు చేకూర్చ డం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ. 80,000 కోట్ల బడ్జెట్ తో  దేశంలోని గిరిజన ప్రాం తాల సమగ్రఅభివృద్ధి, సాధికారతను సాధించే దిశగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  కనీస మద్దతు ధర పొందే చిన్న అటవీ ఉత్పత్తుల సంఖ్యను 12 నుంచి 87కు పెంచారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole