జై భారత్ సత్యాగ్రహ సభ సక్సెస్.. కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు : ఎపిసిసి గిడుగు రుద్రరాజు
విజయవాడ: జై భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. 1921 సంవత్సరం లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశంలో సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్నవాళ్లకు మొన్నటి సభతో కనువిప్పు కలిగిందన్నారు.ఇక అన్ని జిలాల్లో ఇలాంటి సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.కర్ణాటక లో ఉన్న తెలుగు వాళ్లంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నేతలు రఘువీరా రెడ్డి, శైలజానాథ్, మస్తాన్‌వలీ లుకు కొన్ని ప్రాంతాల్లో బాధ్యత లు ఇచ్చామని గిడుగు పేర్కొన్నారు.
కాగా వైజాగ్ స్టీల్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామని గిడుగు రుద్రరాజు తెలిపారు. సభకు రాహుల్ గాంధీ సైతం హాజరవుతారని అన్నారు. నియోజకవర్గం స్థాయిలో పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించి.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేలా పెద్దల తో కలిసి ముందుకు సాగుతామని తేల్చిచెప్పారు. కర్నాటక ఫలితాలు దేశ రాజకీయాల్లో మార్పు కి నాందిగా ఆయన అభివర్ణించారు. కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని గిడుగు ధీమా వ్యక్తం చేశారు.