గవర్నర్ చేతులమీదుగా రుద్రమదేవి కాంస్యవిగ్రహావిష్కరణ !
చందుపట్లలో రాణిరుద్రమ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నకిరేకల్ మండలం చందుపట్లలో పర్యటించారు. చందుపట్లలో ఉన్న రాణీరుద్రమ మరణశాసనానికి గవర్నర్ పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహరాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో ఉందని తెలిసినప్పటినుంచి వీరగాథలు తెలుసుకోవాలని కుతుహులంగా ఉన్నట్లు గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని యావత్ భారతావానికి చాటిచెప్పి..ఆకాలంలోనే స్రీజాతి ఔనత్యానికి…