కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం.. ఘాటు కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్స్..
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలంగాణ సంపదను కేసీఆర్ బీహార్ కు దోచిపెడుతున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే..అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ కాంక్షే సీఎం కేసీఆర్ లో కనబడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. జవాన్ల మరణాలకు కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాడని ఆయన తప్పు బట్టారు.సీఎం కేసీఆర్ మాటలు వినలేక నీతిష్ కుమార్ లేచి నిలబడ్డాడని.. తెలంగాణ నవ్వుల పాలు చేస్తున్నాడని…