కులమతాలకు అతీతంగా అందరీని కలుపుకుని ముందుకెళ్లాలి: కేసీఆర్

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అట్టడుగు ప్రజలకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌కు ముఖ్య అతిధిగా హాజరైన కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఎంతోమంది అమరవీరుల త్యాగఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన.. ఆమహానీయుల గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

కాగా  మౌనం వహించడం మేధావుల లక్షణం కాదని.. ధీరోదాత్తుల మారి సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇక అహింస ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా జయించవచ్చని ప్ర‌పంచానికి సందేశం ఇచ్చిన మ‌హ్మ‌త్ముడు పుట్టిన గ‌డ్డ మ‌న భార‌తావ‌ని అని అన్నారు కేసీఆర్. మహాత్ముడు నడియాడిన నేలపై కులమతాలకు అతీతంగా అందరీని కలుపుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత నేటితరంపై ఉందని కేసీఆర్ పేర్కొన్నారు .