ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా స్వతంత్ర భారత ముగింపు వేడుకలు(ఫోటోస్)

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌లు. కార్యక్రామానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం కేసీఆర్. మహాత్మగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్.

ఈ ముగింపు వేడుకకు శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

తెలంగాణలో 15 రోజుల పాటు నిర్వహించిన భారత వజ్రోత్సవాలు యావత్ దేశాన్ని ఆకర్షించాయన్న కేసీఆర్. స్వతంత్ర భారత వజ్రోత్సవాల అపురూప ఘట్టాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు.

పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు కేసీఆర్. సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే బాధ్యత నేటి యువతరంపై ఉందన్నారు.

గాంధీ బాటలోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి.. రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు కేసీఆర్. మేధావి వర్గం మౌనం వహించడం సరికాదన్నారు.

దేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద, మానవ వనరులున్నాయని కేసీఆర్ తెలిపారు.గాంధీ గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు.

గాంధీ సినిమాను 22 లక్షలమందికి పైగా పిల్లలు చూశారని.. తనకెంతో గర్వంగా, సంతోషంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానించారు కేసీఆర్

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కోటి మందికి పైగా ఒకేసారి పాల్గొని విజయవంతం చేశారని కేసీఆర్ కొనియాడారు.

credit: facebook