యాంటీబాడీలు పెరుగుతున్నాయి:ఆరో సెరోలాజికల్ సర్వే
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొంత మేర తగ్గింది. అయితే, టీకాతో పాటు ప్రజల్లో యాంటీబాడీలు కూడా పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో చేపట్టిన ఆరో సెరోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వేలో భాగంగా పరీక్షించిన వారిలో 90 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. తాజా సెరో సర్వే సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించబడింది. ఇందులో మొత్తం 280 సివిక్ వార్డుల నుండి 28,000 రక్త నమూనాలను సేకరించారు….