Article370: ఆర్టికల్ 370 చుట్టూ జమ్మూ కశ్మీర్ ఎన్నికలు..!
Jammu Kashmir: మంచు లోయలతో పర్యాటకుల మనస్సులను ఆహ్లాదపరుస్తూ చల్లని వాతావరణంతో కేరింతలు కొట్టించే భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ వేసవి కాలం కాకపోయినా ఎన్నికల రాజకీయాలతో వేడెక్కుతోంది. పదేళ్ల అనంతరం ప్రత్యేకించి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాసనసభ ఎన్నికలు జరుగుతుండడంతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పండితులు జమ్మూ కశ్మీర్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఎన్నికలను అధ్యయనం చేస్తున్న విశ్లేషకులు, మీడియా వర్గాలు తమ తమ కోణాల్లో…