టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూపై బీజేపీ ఫైర్.. యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్..!!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు.మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే తెలిసే.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారానికి ఢిల్లీ కేంద్రంగా కథ , స్క్రీన్ ప్లే కేసీఆర్ రచించారని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈవిచిత్ర డ్రామా వెనక నిజాలు ఎంటో తెలవాలంటే ప్రగతిభవన్ మూడు రోజుల సీసీ ఫుటేజీ చూస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు. ఈవిషయంలో…