ఇందిరమ్మ మార్గంలో అదానీ గ్రూప్‌!

Nancharaiah merugumala:( senior journalist) =========== భారత జాతీయ జెండాను ఒంటి నిండా కప్పుకున్న గౌతముడిని ఎవరు కాపాడతారు? దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తాను దిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో (1966–77, 1980–84) తనపైన, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు–‘ ఇది ఇండియాపై దాడి. భారత దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బదీయడానికి ఇది విదేశీ శక్తుల కుట్ర,’ అని విరుచుకుపడేవారు. ఇప్పుడు అదానీ గ్రూపు కంపెనీలపై అమెరికాకు చెందిన హిండన్‌ బర్గ్‌ రీసెర్చ్‌…

Read Full News

హిందూ దేవతలను కించ పరిస్తే సహించేది లేదు: జనసేన పవన్

సెక్యూలరిజం ముసుగులో హిందూ దేవతలను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అన్ని మతాలను సమానంగా చూసే దృక్పధం ప్రతి ఒక్కరూ అలవరచు కోవాలని పిలుపునిచ్చారు. ఒక మతం వారిని పదే పదే అవమానపరిస్తే…వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని జన సేనాని మండిపడ్డారు. కాగా ఇటీవల హిందు దేవతల మీద దూషణలు…

Read Full News

త్రిపుర తీర్పు..లెఫ్టా..? రైటా…?

దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకమైనవి. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి సెమీఫైనల్సే అని చెప్పవచ్చు. అందుకే బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు విసురుతున్నాయి. తొలుతగా ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 2014లో ఢల్లీి పీఠం…

Read Full News

భారత పార్లమెంటు కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ గ్రేటేనా?

Nancharaiah merugumala: ================== “భారత పార్లమెంటు భవనానికి నూరేళ్లు నిండకుండానే కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ నిజంగా గ్రేటేనా?” బ్రిటిష్‌ ఇండియా సర్కారు 1927లో ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ (ఐఎల్సీ–కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్, సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ: కేంద్ర చట్టసభల ఎగువ దిగువ సభలు) కోసం నిర్మించిన భవనంలోనే 1947 ఆగస్ట్‌ 15 నుంచి భారత రాజ్యాంగ రచన పూర్తయ్యే వరకూ రాజ్యాంగ పరిషత్‌ సమావేశాలు జరిగాయి. భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించాక 1950 జనవరి నుంచి భారత…

Read Full News

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల పోరు …

ఎన్నికలకు ఏడాది ముందరే  పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్‌ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును…

Read Full News

కేంద్ర బడ్జెట్ లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్

వికారాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  వికారాబాద్  జిల్లా పచ్చిమ ప్రాంత ప్రజలు..  రాజధానికి వెళ్ళాలన్న.. జిల్లా కేంద్రానికి రావాలన్న ప్రధాన రహదారి పై రైల్వే క్రాసింగ్  ఉండడం వలన ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధులు.. సంబంధిత అధికారులు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్…

Read Full News

పార్టీలకు ఈ యేడు పరీక్షా కాలమే..!

2023, సమకాలీన భారత రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంవత్సరం. ఈ కాలపు రాజకీయాల్లో ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం. తిరగేసి చూసినా అంతే, అవకాశం మాత్రమే కాదు ఒక అగ్నిపరీక్ష! లోక్‌సభకు 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరమే 9 రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు కశ్మీర్‌ లో ఎన్నికలు జరిపించే చిత్తశుద్ది కేంద్రం కనబరిస్తే, అది ఈ యేడాది ఎన్నికలు…

Read Full News

హంగ్‌ దిశగా కర్ణాటక..

దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. హిమాచల్ సంప్రదాయం కొనసాగించాలని కాంగ్రెస్, జేడీఎస్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో హోరా హోరీ త్రిముఖ పోరులో విజయం ఏ పార్టీని వరించనున్నది అంశంపై ‘ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్ సైట్ కోసం స్థానిక రిసర్చర్ ‘ సిస్రో ‘ తో కలిసి పీపుల్స్ పల్స్ తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హాంగ్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడయింది. మొత్తం…

Read Full News

ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

బీజేపీ ‘గణతంత్ర’ స్వభావం వల్లే ప్రధాని తల్లి అంత్యక్రియలు అలా  జరిగాయా? స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) కుటుంబం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ రెండో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మరణం, అంత్యక్రియల వార్త ఒకే రోజు పత్రికల్లో చదివాం. సాధారణంగా పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతల తల్లిదండ్రులు కన్నుమూస్తే రెండు మూడు రోజుల జాతర జరగడం మన అనుభవం. బ్రిటిష్‌…

Read Full News

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read Full News
Optimized by Optimole