telangana: తేలని తెలంగాణ బీజేపీ గమనం..!!
BJPTELANGANA: తెలంగాణలో బీజేపీది సంక్లిష్ట పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నట్టే కనిపిస్తుంది, కానీ, ఏదీ తేల్చుకోలేని సందిగ్దస్థితి నుంచి పార్టీ నాయకత్వం బయటపడట్లేదు. కొత్త రాష్ట్రాధ్యక్షుడ్ని ఖరారు చేయలేని అశక్తత! అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూలంగా, లోక్సభ ఎన్నికల్లో అనుకూలంగా ఫలితాలు సాధించిన బీజేపీ పరిస్థితి రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమిటి అంటే, ‘ఇదీ’ అని సమాధానం చెప్పలేని అయోమయం. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందమనే రాజకీయ విమర్శల నుంచి బయటపడే గుంజాటన…