Runamaphi: రైతు రుణమాఫీతో కాంగ్రెస్ ఎస్కేప్ ప్లాన్ ..!

Telangana: రుణమాఫీతో తమది రైతు అనుకూల ప్రభుత్వమని నమ్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం భారీ ఎత్తున ప్రకటనలకు, సంబరాలకు కోట్ల రూపాయిల్ని ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. మొదటి విడతలో చేసిన మాఫీతో అన్నదాతలందరూ తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది.  ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణమాఫీ సంపూర్ణంగా లేకుండా ఒక మాయాజాలంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం పారదర్శకతతో అమలు చేస్తేనే…

Read More
bjp telangana,bjp,

BJP: ద‌క్షిణాదిన‌ పుంజుకున్న‌ బీజేపీ..

BJP:  ‘‘ఉత్తరాదికి చెందిన భారతీయ జనతా పార్టీ బలం దక్షిణాదిన నామమాత్రమే… హిందీ బెల్టు రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయించే బీజేపీకి ఇక్కడ ఉనికే లేదు…’’ అంటూ ప్రతిపక్షాలు, మేధావులుగా చెప్పుకునే రాజకీయ విశ్లేషకులు నిత్యం చేసే ప్రకటనలు తప్పని 2024 దేశ సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ ఈ ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కూడా గణనీయమైన ఫలితాలను సాధించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండీ’ నేతలు మరింత రెచ్చిపోయి…

Read More

Bandisanjay: రుణ‌మాఫీ అమలుపై కాంగ్రెస్ మాట త‌ప్పింది: బండిసంజ‌య్‌..

Bandisanjay: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందన్నారు కేంద్ర‌హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్‌. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప…

Read More

Telangana: బిఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందా..?

Telanganacongress: ఎన్నికలు ముగియగానే ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా అధికారం చేపట్టినవారు ‘‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఇక పై అభివృద్ధిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాం…’’ అంటూ తియ్యటి మాటలను వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యతిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనతో సంతృప్తి చెందని ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు మించి పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి గుణపాఠం…

Read More
bjp telangana,bjp,

BjpTelangana: తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పోరు.. పాత కొత్త కలహాలు..!

BjpTelangana:  ‘‘మంచి నాయకుడికి సహనం అనే గుణం ఉండాలి. ఎదగాలనుకునే నాయకుడు ఓపిక పడితే కచ్చితంగా కష్టానికి తగిన ఫలం పొందుతాడు..’’ అనే చాణక్య రాజనీతి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. లోక్సభ ఎన్నికలు అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకుల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అధ్యక్ష పదవి పోరులో నాయకులు సహనం కోల్పోయి చేస్తున్న వ్యాఖ్యలతో నష్టం జరుగుతున్నా బీజేపీ అధిష్టానం…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

Bandisanjay: శ్రీరాముడి ఆక్షింతలను కించపర్చే స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దిగజారారు: బండి సంజయ్

Bandisanjay: ‘‘త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో మనమే నెంబర్ వన్. బ్యాలెట్ పేపర్ లో కూడా 1వ స్థానం మనదే. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ, ఊరూవాడా కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్ లోని 1వ నెంబర్ పక్కనున్న పువ్వు గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించండి’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు…

Read More

Telangana:ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ : బండి సంజయ్ 

Bandisanjay: సిఎం రేవంత్ రెడ్డికి  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్  అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ అని.. అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని, బ్రిటోషోడు స్థాపించారని ఎద్దేవ చేశారు. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే బ్రిటీష్ సివిల్ సర్వంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బ్రిటీష్ పార్టీని ఇటలీ నేత ఏలుతున్నరని…. పేరులోనే భారతీయతను సంతరించుకున్న పార్టీ బీజేపీ. ఈ దేశ ముద్దు…

Read More

Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి అంటే?

Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు చాలా రోజులు ఉంది కదా అన్న  భ్రమల్లో పార్టీల  నేతలు ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నామని తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. మోదీ గాలితో నెట్టుకు రావొచ్చని అటు బీజేపీ భావిస్తోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొద్దు నిద్ర విడిచి ప్రజా క్షేత్రంలో దూకుడుగా వెళుతోంది. మరి ఇప్పటికపుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక…

Read More

BJPTELANGANA : లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి జాక్ పాట్.. 12 సీట్లు గెలిచే అవకాశం ?

loksabhaelections2024:  పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి  నోటిఫికేషన్ వెలువడడంతో  తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.  లోక్ సభ  ఎన్నికల్లో   ఏ పార్టీ బలమెంత?  ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్న విషయంపై పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలెట్టాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఫస్ట్ ట్రాక్ పోల్ ను సైతం విడుదల చేశాయి.  సర్వే సంస్థల రిపొర్టు ప్రకారం తెలంగాణలో బీజేపీ మెజార్టీ   స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. ఇంతకు ఆ…

Read More
Optimized by Optimole