జాతీయ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడా?: బండి సంజయ్

తెలంగాణలో గ్రామపంచాయతీ నిధుల మళ్లింపుపై  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని..జాతీయ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడా? అంటూ ఎద్దేవా చేశారు. ఆహారపు అలవాట్లపై కేసీఆర్ చేసిన అవమానాన్ని ఆంధ్ర ప్రజలు మరచిపోగలరాని?ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల్ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్న కేసీఆర్..తెలంగాణను నాశనం చేసి.. దేశాన్ని ఉద్ధరించడానికి బయల్దేరాడని  విమర్శించారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మూసేసి తెలంగాణ ప్రజల దృష్టి…

Read More

టీఆర్ఎస్ నేతలే ఓట్లేసుకుంటున్నారు… ఫలితాలు ప్రకటించుకుంటున్నారు: సంజయ్

సెస్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారు మారు చేస్తారా? అంటూ ద్వజమెత్తారు. సెస్ ను నాశనం చేసిన టీఆర్ఎస్ కు ఓట్లేయలేదేనే అక్కసుతో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తారాని?  సంజయ్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలే ఓట్లేసుకుంటున్నారు… వాళ్లే ఫలితాలను ప్రకటించుకుంటున్నారని.. ఇంతదానికి ఎన్నికలెందుకు? ఫలితాలు ప్రకటించడమెందుకు? ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు? అని…

Read More

ట్విట్టర్ టిల్లుకు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’: బండి సంజయ్

వేములవాడ: ట్విట్టర్ టిల్లు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’’కారణంగా మతితప్పి మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత.. నా తల నరకినా, చెప్పుతో కొట్టినా ప్రజల కోసం భరించేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ క్రైస్తవ మత ప్రచారం చేస్తారా?అంటూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పై సంజయ్ విరుచుకుపడ్డారు. అలాంటి అధికారిని రోడ్లమీద ఉరికించి కొట్టండని పిలుపునిచ్చారు.   ఇక…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్, బ్రోకర్.. ఎప్పుడో చెప్పా : రాజగోపాల్ రెడ్డి

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, బ్రోకర్ అని తాను ఎప్పుడో చెప్పానని.. అతనితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం బెటర్ అంటూ విమర్శించారు.ప్రజా సమస్యల గురించి కొట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదని.. తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని.. తాను ఆరోజే చెప్పానని స్పష్టం చేశారు.నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని రాజగోపాల్…

Read More

బండి ఆరో విడత పాదయాత్రకు సన్నద్ధమవుతున్న కమలదళం..

తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో  బిజెపిలో జోష్ కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో తృటిలో విజయం చేజారడంతో క్యాడర్ కొంత నిరాశ చెందింది.ఇప్పుడు  ఐదో విడత పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించడం చూసి..తదుపరి పాదయాత్రకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా వచ్చిన వినతి పత్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ యాత్రను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ ఐదో విడత…

Read More

బండి సంజయ్ ఎమోషనల్..

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ బిజెపి కార్యకర్తల కృషితోనే తాను ఎంపీనయ్యానని… బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిందని భావోద్వేగంగా ప్రసంగించారు. కరీంనగర్ గడ్డపై కాషాయం జెండా ఎగరడంతో..దేశం ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు.  బండి సంజయ్ అంటే ఎవరు.. ఎవరికి తెలుసు..ఎవరు ఓటేస్తారని.. హేళన చేసిన వాళ్లకి.. ఎంపీగా పోటీచేసి.. లక్ష ఓట్ల తో గుబగుయ్యమనిపించేలా సమాధానమిచ్చనట్లు సంజయ్…

Read More

కరీంనగర్ కాషాయమయం..పాదయాత్ర ముగింపు సభ గ్రాండ్ సక్సెస్..

బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ పట్టణం కాషాయ రంగు పులుముకుంది. పట్టణంలో ఎక్కడ చూసిన బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.  సభా  వేదిక…SRR కాలేజ్ ప్రాంగణం భారత్ మాతాకీ జై నినాదాలతో దద్దరిల్లింది. వేదికపై కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సింగర్ లక్ష్మి గానానికి అనుగుణంగా కాషాయం కార్యకర్తలు తమదైన  స్టెప్పులతో అదరగొట్టారు. ఇక సభ ప్రారంభం కాగానే..  బిజెపి నేతలు  సీఎం కేసిఆర్ పాలనపై తీవ్ర…

Read More

మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదు :బండి సంజయ్

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. “సారా స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణలో మానవ హక్కులను హరించి పోవడానికి కేసిఆర్ కారణమన్న సంగతి కవిత మరచిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేసి.. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నరని మండిపడ్డారు. నిజాలు రాసే…

Read More

గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను: బండి సంజయ్

గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేనన్నారు  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. జగిత్యాల నుంచి.. కుటుంబ పోషణ కోసం  టెన్త్ క్లాస్ చదివే  పిల్లాడు దుబాయ్ కి వలస పోయే దుస్థితి దాపురించిందన్నారు.  ప్రతిరోజు 5 బస్సుల్లో జనం ముంబైకి వలస పోతున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే విదేశాల్లో వేల మంది వలస కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారన్నారు.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జగిత్యాల జిల్లా  ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా …

Read More

చంపినా సరే.. కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: బండి సంజయ్

చంపినా సరే…  చావడానికి రెడీ… కానీ కేసిఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. లక్ష కోట్ల దొంగ సారా, పత్తాల(క్యాసినో) దందాతో సంపాదించిన సొమ్ముతో  ముఖ్యమంత్రి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్..కోరుట్ల, వేములవాడ, జగిత్యాల’ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. లిక్కర్ స్కాంలో విచారణ చేసేందుకు కవిత…

Read More
Optimized by Optimole