జాతీయ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడా?: బండి సంజయ్

తెలంగాణలో గ్రామపంచాయతీ నిధుల మళ్లింపుపై  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని..జాతీయ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడా? అంటూ ఎద్దేవా చేశారు. ఆహారపు అలవాట్లపై కేసీఆర్ చేసిన అవమానాన్ని ఆంధ్ర ప్రజలు మరచిపోగలరాని?ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల్ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్న కేసీఆర్..తెలంగాణను నాశనం చేసి.. దేశాన్ని ఉద్ధరించడానికి బయల్దేరాడని  విమర్శించారు.

ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మూసేసి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్రం ప్రైవేటికరణను ప్రోత్సహిస్తోందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ఉద్యమంలో చెప్పిన అజాంజాహీ మిల్లు ఏమైందని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తుల్ని కేసీఆర్ అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ రగిలించి.. జై తెలంగాణ పేరుతో ఓట్లేయించుకున్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆంధ్రాలో ఓట్ల కోసం జై తెలంగాణ అన్న  నినాదాన్ని కూడా పలకలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆంధ్రవాళ్లు ప్రశాంతగా వ్యాపారాలు చేసుకోవాలంటే కల్వకుంట్ల కుటుంబానికి వాటా ఇవ్వాల్సిందేనని సంజయ్ కుండ బద్దలు కొట్టారు.