pawankalyan: కాశీ చేరుకున్న చంద్రబాబు, పవన్ ఎవరికి పిండాలు పెట్టడానికో!

Nancharaiah Merugumala senior journalist:  తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు కానీ, ఎందరో పెద్ద పెద్ద ఆంధ్రా లీడర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు భీమవరం రెడ్లబ్బాయి గొలుగుమూరి సత్యనారాయణ రెడ్డి మామ రేవంత్.. మొదట కేరళ వయనాడ్ నుంచి, తర్వాత మొన్న యూపీలోని రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రెండు సందర్భాల్లో రెవంతయ్య అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన ప్రత్యక్షమయ్యారు. రేవంత్ చేసిన పనిలో తప్పేం లేదు. ఎందుకంటే రాహుల్, రేవంతులు…ఇద్దరూ ఒక పార్టీ వాళ్లే. కానీ ఏపీలో బీజేపీ భాగస్వామ్య పార్టీల నేతలైన నారా చద్రబాబునాయుదు, కొణిదెల పవన్ కల్యాణ్ లు ఇద్దరూ పాలోమని మంగళారం కాశీ పోతున్నారు. నేడు వారాణసి లో నామినేషన్ వేస్తున్న ప్రధాని నరేంద్ర భాయ్ మోదీ ముందు ప్రత్యక్షమై ఈ ఇద్దరు తెలుగు బాబులూ హాజరు వేయించుకుంటే విస్తృత కమ్మ, కాపు సమాజాలకు మేలేగా! అదీగాక, కుల అహంకారానికి ప్రతిరూపాలైన కాపులు, ధనబలానికి నిలువెత్తు చిహ్నాలైన కమ్మల తరఫున వరుసగా కల్యాణ్ బాబు, చంద్రబాబులు…గుజరాతీ తేలీ ప్రధాని ముందు మోకాళ్లపై సాగిలపడడం మాజీ తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు మాటల్లో చెప్పాలంటే.. ప్రజాస్వామ్య అద్భుతం..నిజంగానే.