మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదు :బండి సంజయ్
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. “సారా స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణలో మానవ హక్కులను హరించి పోవడానికి కేసిఆర్ కారణమన్న సంగతి కవిత మరచిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేసి.. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నరని మండిపడ్డారు. నిజాలు రాసే…