Bollywood
‘దంగల్ ‘ రికార్డ్ బ్రేక్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ..
1990లో కశ్మీరీ పండిట్ల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఎనిమిదవ రోజు(19.15కోట్లు).. అమిర్ ఖాన్ దంగల్(రూ.18.59 కోట్లు) రికార్డును బ్రేక్ చేసి.. బాహుబలి_2 (19.75)చేరువలో ఉంది. టోటల్గా ఈ సినిమా ఇప్పటివరకూ రూ.116.45 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినిక్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన…
బాలీవుడ్ స్టార్ హీరో మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్..?
టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన నటి రష్మిక మందన లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణితి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రష్మిక.. అల్లు అర్జున్_ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ…
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి కన్నుమూశారు.గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బప్పిలహరి 1952, నవంబర్ 27న జన్మించారు. భారత చిత్రసీమకు డిస్కోను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఆలపించిన పాటల్లో.. ‘చల్తే చల్తే’, ‘డిస్కో డ్యాన్సర్’, ‘షరాబీ’ వంటి గీతాలు యువతను ఉర్రూతలూగించాయి. హిందీ, తెలుగు, బెంగాళీ, తమిళం, కన్నడ, గుజరాతీ చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా…
రియాలిటీ షోకూ హోస్ట్ గా కంగనా రనౌత్..?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్.. డిజిటల్ ప్రొడక్షన్ హౌస్ ఏఎల్టీ బాలాజీ ఈ రియాలిటీ షోనూ నిర్మించనుంది.కాగా ఏక్తా కపూర్ కోసం తొలిసారి వ్యాఖ్యాతగా మారనున్నాను అంటూ కామెంట్ చేసిన కంగనా..కాసేపటికే ఆ పోస్ట్‌ను తొలగించారు. దీంతో ఈ విషయాన్ని త్వరలోనే నిర్మాత ఏక్తా కపూర్ అధికారికంగా ప్రకటించే అవకాశం…
సుఖేష్ చంద్రశేఖర్ కేసులో విస్తుగోల్పే విషయాలు వెలుగులోకి!
సుఖేశ్ చంద్రశేఖర్ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 200కోట్ల మోసం కేసులో అరెస్టైన సుఖేశ్.. ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నాడు. అయితే అక్కడ తనకు ఖరీదైన వసతులు కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్.. ప్రతి నెలా కోటి రూపాయలు లంచం ఇస్తున్నట్లు తాజాగా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల…
పూనమ్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన భర్త.. అసలు ఏం జరిగింది..?
బాలీవుడ్లో బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచారు. తన భర్త సామ్ అహ్మద్ శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సామ్ పై గృహా హింస కింద కేసు నమోదు చేశారు. కాగా బాలీవుడ్లో బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన పూనమ్ ..సామ్ తో డేటింగ్ అనంతరం సెప్టెంబర్ 9 న వివాహ బంధం తో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లిన…