Ayodhya: అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేదు?
సాయి వంశీ ( విశీ) : నిజమే! మొత్తం దేశానికి ఇదొక ప్రశ్న. రామమందిరం కట్టారు, బాలరాముణ్ని ప్రతిష్టించారు, ఊరూవాడా ఏకం చేసి సంబరాలు చేశారు. అయినా అక్కడ కమలం వికసించలేదు. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 54,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంత భారీ ఆధిక్యంతో విజయం సాధించడం చిన్న విషయం కాదు. అసలు ఏం జరిగింది? కమలలోచనుడు ఎందుకు కమలం మీద శీతకన్నేశాడు? నిజానికి…