ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో భారత్ 100 ఏళ్ల స్వర్ణం సాకారం!
ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద ఏళ్ళ భారత్ కలను నెరవేర్చాడు యువ అథ్లెట్ నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో ఫైనల్లో గెలిచి.. మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. మొత్తంగా టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్లు ఈసారి గొప్ప ప్రదర్శన చేశారు. దీంతో ఓ స్వర్ణం.. రెండు రజతాలు.. నాలుగు కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో ఒలంపిక్స్ లో సరికొత్త చరిత్రను లిఖించిన నీరజ్ పై ప్రశంసల వర్షం…