Telangana: తెలంగాణ బీజేపీలో బీసీ నేతల వర్గపోరు… కమలం పార్టీలో అంతర్యుద్ధం?
BJPTELANGANA:తెలంగాణ బీజేపీలో బీసీ నేతల మధ్య జరుగుతున్న వర్గపోరు ఆ పార్టీకి పెను సవాలుగా మారింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో ముదిరి పాకనపడ్డాయని కమలం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైకి మాత్రం రెండు వర్గాల నేతలు శాంతంగా కనిపిస్తున్నా..లోలోపల మాత్రం ఒకరి గొయ్యి..మరొకరు తవ్వే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల కాళేశ్వరం విచారణ…