chandramohan: చంద్రమోహన్‌లా వచ్చారు.. చంద్రమోహన్‌లా వెళ్లిపోయారు..!
విశీ: అవసరమైన విషయాలను వదిలేసి అనవసరమైనవి గుర్తు పెట్టుకోవడంలో ప్రపంచంలో తెలుగు వాళ్లని కొట్టేవాడు లేడు. తెలుగు వాళ్లకు భలే భలేటి విషయాలు గుర్తుంటాయి. అసలు విషయాలు, అతి ముఖ్యమైన సంగతులు మాత్రం అరిచి గీపెట్టినా గుర్తుండవు. ఫలానా ఆవిడ ఫలానా ఆయనతో తిరుగుతోంది, ఫలానా అతను ఫలానా ఇంటి ముందు రాత్రిపూట తచ్చాడాడు, ఫలానా వాళ్లు విడాకులు తీసుకున్నారు, ఫలానా ఆవిడకు పెళ్లయినా కాళ్లకు మెట్టెలు లేవేంటి.. ఇలా సవాలక్ష విషయాలు మన జ్ఞానగ్రంథుల్లో…