ఉచితాలు’తాత్కాలిక ఉపశమనమే కాదు..దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు..!
రాజకీయాలు రోజు రోజుకు పూర్తిగా రూపు మార్చుకుంటున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే తీవ్రమైక కోరికతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలు సైతం ఉచితాలకు అలవాటు పడి, ఏ పార్టీ ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తే ఆ పార్టీకే పట్టం కట్టే పరిస్థితి దాపురించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలును నిలదీసే ధైర్యం ప్రజలు లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోతోంది. వాస్తవానికి ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి పథకాలను…