జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల..
Janasena: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు అన్నపరెడ్డి నాగశివయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగశివయ్య కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అతని భార్య పావనికి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు….