క్లీన్ స్వీప్ చేస్తామన్న ముఖ్యమంత్రికి అభద్రత భావం ఎందుకు: మనోహర్
ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రజల దగ్గరకు ప్రతిపక్షాలు వెళ్తే నష్టం వస్తుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం.. జీవో 1 పేరుతో ఆంక్షలకు పూనుకుందని మండిపడ్డారు. నిరంకుశ జీవోలు తీసుకొచ్చినంత మాత్రాన ప్రజల మనసులను మార్చలేరని స్పష్టం చేశారు.175కి 175 స్థానాలు గెలుస్తామన్న సీఎం జగన్ రెడ్డికి.. అభద్రతా భావం? ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో పెన్షన్ తొలగించారని.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఆందోళనకి…