Telangana:బహుజన తెలంగాణే లక్ష్యం: కవిత
Nijamabad: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పోరాడిన ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో బహుజన తెలంగాణను నిర్మించడమే తమ లక్ష్యమని కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజల ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఎంతమేర మార్పు వచ్చిందన్నదే ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర సంపద, వనరులు, అధికార ఫలాలు కొద్దిమందికే పరిమితం కాకుండా పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు,…
