తెరాస ఎజెండా తెలంగాణ అభివృద్ధి: కె. కేశవరావు
తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా దోస్తీ కట్టేందుకు తాము సిద్ధమని తెరాస పార్లమెంటరీ నేత కె. కేశవరావు వెల్లడించారు. పార్లమెంటులో శనివారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ఏకైక ఎజెండా తెలంగాణ అభివృద్ధేనని.. రైతు చట్టాలను తాము తొలుత వ్యతిరేకించామన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టాల గురించి రైతులతో చర్చలు జరపడం సంతోషంగా ఉందన్నారు. ఇక దేశ రాజధానిలో రిపబ్లిక్ డే రోజు జరిగిన ఘటన దౌర్జన్యం అని ఒకరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ…