బీజేపీలోకి విశ్వేశ్వర్ రెడ్డి.. మరో ఎమ్మెల్యే చేరే అవకాశం?
తెలంగాణలో బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. ఆపార్టీలోకి చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. ప్రధాని మోదీ సమక్షంలో ఆపార్టీలో చేరనున్నట్లు ప్రకటించాడు.అధికార టీఆర్ ఎస్ ఎదుర్కొవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని.. అందుకే బీజేపీలో చేరుతున్నానని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు నల్గొండ, ఖమ్మంతో పాటు పలుజిల్లాలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ప్రధాని మోదీ ,…